హైకోర్టుకు రకుల్ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్

 

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు...ఈ నేపథ్యంలోనే పోలీసులు మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించగా అందులో హీరోయిన్ సోదరుడు ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పై కేసు నమోదు చేశారు. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో అమన్‌ను ఏ7 నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసు నమోదు అయిన నాటి నుంచి  అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగదారుడిగా (డ్రగ్స్ కన్స్యూమర్) అమన్‌పై ఆరోపణలు ఉన్నాయి. 

ఇదే కాకుండా, ఇది అమన్‌పై నమోదైన రెండో డ్రగ్స్ కేసు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మరోవైపు అమన్ ప్రీతిసింగ్ డ్రగ్స్ కేసులో తనపై నమోదు చేసిన FIRను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హీరోయిన్ సోదరుడు అమన్ ప్రీతిసింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సహా నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే తనను నిందితుడిగా చేర్చారని, ప్రత్యక్ష ఆధారాలు లేకుండా కేసులో ఇరికించారని అమన్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.కేవలం ఇతర నిందితుల వాంగ్మూలాల ఆధారంగా తనపై కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అంతేకాకుండా,  తాను  డ్రగ్స్ కన్స్యూమర్ అనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని అమన్ వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో కీలక అంశాలపై పూర్తి వివరాలతో హాజరు కావాలని పోలీసులను కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఒకవైపు హైదరాబాద్‌లో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుం టున్న నేపథ్యంలో, సెలబ్రిటీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి డ్రగ్స్ కేసులో చిక్కుకు న్నాడని  తెలియడంతో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

Online Jyotish
Tone Academy
KidsOne Telugu