గ్రీన్‌లాండ్ విలీనానికి అమెరికా సెనెట్‌లో బిల్లు
posted on Jan 13, 2026 5:29PM

డెన్మార్క్ దేశంలో అంతర్భాగంగా ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్‌లాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లు ప్రవేశపెట్డాడు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకోవడానికి ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ అభిప్రాయపడ్డాడు.
అమెరికా విరోధులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అలా జరగనివ్వబోమ్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాలను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వ్యాఖ్యానించారు. వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరకా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్ నుంచి దూరం చేయడానికి అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయడానికి ప్రయత్నించారని ప్రచారం జరిగింది.
అయితే యూఎస్ ప్రతిపాదనను గ్రీన్‌లాండ్ నాయకులు తిరస్కరించారు. తమ ప్రాంత భవిష్యత్తును విదేశాలు నిర్ణయించలేవని గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ స్పష్టం చేశారు. నాటో దేశాలు సైతం యూఎస్ ప్రణాళికపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా వెనకడుగు వేయని ట్రంప్ గ్రీన్‌లాండ్ స్వాధీనానికి పావులు కదుపుతూనే ఉండటం చర్చనీయాంశంగా మారింది.