చావు బతుకుల్లో డాక్టర్ ప్రణీత 

అత్తింటి వేధింపులు తాళలేక హైదరాబాద్  కర్మన్ ఘాట్కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రణీత బుధవారం  ఆత్మహత్యయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ యత్నానికి ముందు డాక్టర్ ప్రణీత సెల్ఫీ వీడియో చేసి తల్లికి పంపింది. నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల ప్రణీత  స్పృహ కోల్పోయింది. చికిత్స నిమిత్తం  స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అయితే ప్రణీత ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రణీత మామయ్య కొట్టడం వల్లే ఆత్మహత్యాయత్నం  చేసుకున్నట్లు ప్రణీత  కుటుంబ సభ్యులు తెలిపారు. అత్తింటివారు అదనపు కట్నం కోసం తన కూతురును వేధింపులకు గురి చేసారని డాక్టర్ ప్రణీత తల్లి పేర్కొంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu