డ్రగ్స్ డెలివరీ తీసుకుంటూ డాక్టర్ అరెస్టు

హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్‌గా సేవలందిస్తున్న ఓ మహిళ.. డ్రగ్స్‌కు బానిసగా మారడం సంచలనం సృష్టిస్తోంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన డాక్టరే వాటిని తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఒక్క సంవత్సరంలోనే సుమారు  70 లక్షల రూపాయల విలువైన మాదకద్రవ్యాలను ఆ వైద్యురాలు సేవించినట్లు   పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. కచ్చితమైన సమాచారంతో ఆ వైద్యురాలిపై నిఘాపెట్టి   డ్రగ్స్​ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. 

 షేక్ పేటలోని ఏపీఏహెచ్‌సీ కాలనీకి చెందిన డాక్టర్ చిగురుపాటి నమ్రత (34) ఒమేగా హాస్పటల్ లో సీఈవోగా పని చేస్తున్నారు.  ముంబైకి చెందిన డ్రగ్ డీలర్ వాన్స్ టక్కర్‌ను వాట్సాప్​లో సంప్రదించి ఐదు లక్షల రూపాయల విలువైన  కొకైన్​కు ఆర్డర్ చేశారు. ఆన్​లైన్​లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడంతో వాన్స్ తన సహాయకుడు బాలకృష్ణ రాంప్యార్ రామ్ ద్వారా కొకైన్ పంపించాడు.  కొకైన్ ను రాంప్యార్ నుంచి డాక్టర్ నమ్రత తీసుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   డాక్టర్ నమ్రతతో పాటు రాంప్యార్​ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  పోలీసులు వీరి నుంచి 53 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం  చేసుకున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu