ఆస్ప‌త్రిలో ఏడ్చినందుకు ఆదనంగా రూ. 3000 చెల్లించు!

దొంగ‌కి జ‌రిమానా వేయ‌డం విన్నాం. క‌రెంటు బిల్లు అద‌న‌పు ఛార్జీలు క‌ట్ట‌మ‌ని తాకీదు నిస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపితే.. ఫోన్ కు చలానా కట్టాలని మెసేజ్ వచ్చేస్తుంది. కానీ  ఒక  డాక్ట‌ర్  త‌న పేషెంటుకి అదనంగా మూడు వేలు క‌ట్ట‌మ‌ని బిల్లు ఇచ్చాడు. ఎవ‌ర‌న్నా రోగుల‌ను ప‌రీక్షించి ఫీజు కింద డాక్టర్లు ఎంతో కొంత డ‌బ్బులు ఫీజుగా తీసుకోవ‌డం  సహజం.

కానీ  చికిత్స జ‌రిగే స‌మ‌యంలో భ‌య‌ప‌డో, లేదా ఏదో ఆందోళ‌న‌కు గుర‌య్యో ఏడిచిన పేషెంటుని అదనంగా మూడు వేల రూపాయ‌ల  బిల్లు క‌ట్ట‌మ‌న్నాడు  ఒక డాక్ట‌ర్‌! విన‌డానికి  చాలా చిత్రంగా వుంది గ‌దూ?  కానీ ఇది నిజంగా నిజ‌ం. ఈ సంఘటన న్యూయార్క్‌లో జ‌రిగింది. 

న్యూయార్క్ లో ఒక మ‌హిళ గ‌త కొద్ది రోజులుగా ఆరోగ్య స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో స్థానికంగా వున్న ఆసుప‌త్రికి వెళ్లి డాక్ట‌ర్‌ని సంప్ర‌దించింది. ఆమెకు చికిత్స చేయాల‌ని డాక్ట‌ర్లు నిర్ధారించేరు. అంత‌వ‌ర‌కూ బాగానే వుంది. కానీ చికిత్స స‌మ‌యంలో స‌ద‌రు మ‌హిళ తీవ్ర భావోద్వేగానికి గుర‌యింది. కంట త‌డి పెట్టింది.  భయంతోనో, లేక తట్టుకోలేని నొప్పితోనో ఆమె చికిత్స సమయంలో బాధ‌తో ఏడ్చేసింది. 

చాలామందికి డాక్ట‌ర్ని లేదా ఆస్ప‌త్రి వాతావ‌ర‌ణం చూడ‌గానే భావోద్వేగానికి గుర‌యి ఏడుపు వ‌స్తుంది. అలాగే  ఆ  పెద్దామె ఏడ్చేసింది. డాక్ట‌ర్ ఆమె ఏడుపు విని కోప‌గించుకున్నాడు. చికిత్స చేస్తుంటే ఏడిస్తే ఎలా అని ఆమె మీద విసుక్కున్నాడు. కానీ ఆస్ప‌త్రి వారు ఆమె కి చివ‌ర‌గా బిల్లు ఇచ్చిన‌పుడూ ఆమెకు ఏడవక తప్పలేదు.   ఎందుకంటే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర  అలా ఏడ్చినం దుకు మూడు వేల రూపాయ‌లు అదనంగా కట్టమని ఆ బిల్లులో.  చేసేదేమీ లేక ఆ మొత్తాన్ని చెల్లించేసింది. తాజాగా ఆ రిసిప్ట్‌ను ఆమె సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది వెంటనే వైరల్ అయిపోయందిజ దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.