మరో చీలిక దిశగా  అన్నాడీఎంకే అడుగులు ?

అనుకున్నదే జరుగుతోంది. ఇంతకాలం అధికారం ఫెవికాల్’ల పనిచేయడంతో, ఏదోలా కలిసున్న,అన్నా డీఎంకే, వైరి వర్గాలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మళ్ళీ పాత పగలలకు పదును పెడుతున్నాయి. పార్టీ అగ్రనేతలు పన్నీర్సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య విభేదాలు మళ్ళీ మరోమారు తెరమీదకు వచ్చాయి. గతంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం కుస్తీపట్లు పట్టిన, ఇరు వర్గాలు ఇప్పుడు ప్రతిపక్ష నేత పదవి కోసం, సెల్వం,స్వామి వర్గాలు పట్టుపడుతున్నాయి. సోమవారం జరిగిన పార్టీ శాసన సభా పక్ష సమావేశంలో పన్నీర్ సెల్వం, తమ వర్గానికి చెందిన మాజీ స్పీకర్ పీ. ధనపాల్’ను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. అందుకు అంగీకరించలేదు.  అయితే, మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం, అందుకు అంగీకరించలేదు. మ్స్స్జీ ముఖ్య మంత్రినే  ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని, అదేవిధంగా,మాజీ ఉప ముఖ్యమంత్రి పనీర్ సెల్వంని శాసన సభా పక్షం ఉప నాయకుడిగా ఎన్నుకోవాలని పట్టు పట్టారు. అంతే, కాదు అప్పటికప్పుడే, ఓటింగ్ కూడా నిర్వహించారని, ఓటింగ్’లో పార్టీ ఎమ్మెల్యేలు 66 మందిలో 61 మంది పళని స్వామికి జై కొట్టారని పార్టీ వర్గాల సమాచారం. దీంతో, ఖంగుతిన్న పన్నీర్ సెల్వం సమావేశం నుంచి వెళ్ళిపోయారు. ఉప నాయకుని పదవినీ తిరస్కరించారు.  

నిజానికి, గతంలో జయలలిత అండతోనే పనీర్ సెల్వం, కేసుల్లో ఇరుకున్న ఆమెకు డమ్మీగా మాత్రమే అలాగే, ప్రజల్లోనూ పలుకుబడి లేదు. అందుకే, జయలలిత మరణంతో సెల్వం చాప్టర్ క్లోజ్ అయి పోయింది. ఇందుకు  జయ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలే  సాక్ష్యంగా నిలుస్తాయి.అప్పట్లో కూడా సెల్వం కొంత కాలం పాటు, తానూ లేస్తే మనిషిని కాదు అనంట్లుగా వ్యవహరించారు.  ముఖ్యమంత్రి పీఠం కోసం  ప్రయత్నించి విఫల మయ్యారు. చివరకు ఉపముఖ్యమంత్రి పదవితో సర్దుకు పోయారు. ఇప్పడు మరో సారి, అదే సీన్ రిపీట్ అవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు.అయితే,అప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పోటీపడిన నాయకులు ఇప్పుడు ప్రతిపక్ష నేత పదివి కోసం పోటీ పడుతున్నారు.అదొక్కటే తేడా, మిగిలిన సీన్ అంతా  సేమ్ టూ సేమ్  అంటున్నారు. 

అయితే, డిప్యూటీ లీడర్ పదవిని తిరస్కరించిన పన్నీర్ సెల్వం, వెనక్కి తగ్గరాదని అనుకుంటే, పార్టీలో ముసలం తప్పదని, కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. నిజంగా, అదే జరిగితే, పార్టులో చీలిక వచ్చినా ఆశ్చర్య పోనవసరలేదని అంటున్నారు. నిజానికి ఇంతకూ ముందే అనుకున్నట్లుగా జయ లలిత మరణంతోనే అన్న డిఎంకే రెండు వర్గాలుగా చీలిపోయింది. అధికారం అతుకుతో ఇంతాకాలం అలా కలిసి ఉన్న పార్టీ, ఇప్పడు అధికారం కోల్పోవడంతో కధ మళ్ళీ మొదటి కొచ్చింది. పైకి బాగానే ఉన్నా.. పార్టీలో మాత్రం అభిప్రాయభేదాలకు కొదవ లేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. పన్నీర్, పళనిస్వామి వ్యవహారం ఇలా ఉంటెఉంటే, జయమరణం,తర్వాత జైలు జీవితానికే పరిమితం అయిన శశికళ, మొన్నటి ఎన్నికలకు ముందు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. అయితే, ఆమె వ్యూహాత్మకంగానే కావచ్చు,రాజకీయ సన్యాసం ప్రకటించారు. కానీ, ఆమె సమీప సహచరుడు దినకరన్ సారధ్యంలోని ఏఎంఎంకే పోటీలో నిలిచింది. దినకరన్ పోటీ చేయడం వలన, అన్నాడీఎంకేకు బలమైన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడులో తేవర్ వర్గం ఓట్లు.. అన్నాడీఎంకే, ఏఎంఎంకేల  మధ్య చీలిపోయాయి. ఈ ప్రభావంతో అనేక స్థానాలను డీఎంకేకు కోల్పోవలసి  వచ్చింది.

ఈ నేపధ్యంలో, శశికళ, దినకరన్ కలిసి పన్నీర్సెల్వంకు మద్దతు ఇచ్చే అవకాశమూ లేకపోదని చెబుతున్నారు.మొత్తానికి, అన్నాడిఎంకేలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, పార్టీలోనే కాకుండా,  తమిళ రాజకీయాల్లో అనూహ్య మార్పులకు కారణం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.