జగన్ మోహన్ రెడ్డికి జేసీ దివాకర్ దీపావళి బంపర్ ఆఫర్

ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య మినీ సీరియల్ వార్ నడుస్తోంది. ఇంతవరకు జరిగిన సీరియల్లో మొదట జేసీ దివాకర్ రెడ్డి తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మధ్య లంకె ఉందని ప్రకటించడం, బొత్స ఆయనని పార్టీ నుండి బయటకి పొమ్మని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, పొమ్మనడానికి నువ్వెవరని? జేసీ అడగడం, దానికి బొత్స సంజాయిషీ ఇచ్చుకోవడం, మళ్ళీ దానికి లగడపాటి కౌంటర్ వేయడం వరకు చూసాము.

 

ఇక తాజా ఎపిసోడ్లో “జగన్మోహన్ రెడ్డి కోరినట్లయితే కాంగ్రెస్ అధిష్టానంతో రాయబారం నడుపుతానని” దివాకర్ రెడ్డి ప్రకటించి ఈ సీరియల్కి మరో ఆసక్తికరమయిన ట్విస్ట్ ఇచ్చారు. నోరు విప్పదని చెప్పినా విప్పడం అంటే బస్తీ మే సవాల్! అనే భావించక తప్పదు. మిగిలిన భాగం తరువాత ఎపిసోడ్లో చూద్దాము.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu