ఓబులాపురం మైనింగ్ కేసు.. డిశ్చార్జ్ పిటిషన్ల కొట్టివేత

గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పదవీ విరమణ చేసిన అధికారులు కృపానందం, రాజగోపాల్, అలాగే గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అలీఖాన్ లు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లన సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం(అక్టోబర్ 17) కొట్టివేసింది.

అక్రమ పద్ధతుల్లో గనుల కేటాయింపు వ్యవహారంలో వీరందరి పాత్రపై ఆధారాలున్నాయన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు వీరందరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే తన డిశ్చార్జ్ పిటిషన్ ను ఉపసంహరించుకున్ సంగతి విదతమే. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో అభియోగాల నమోదులో తీవ్ర జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ వేగవంతమైన సంగతి విదితమే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu