దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు తుది తీర్పు.. శిక్షలు ఖరారు

దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసును విచారించిన కోర్టు ఆరుగురిని దోషులుగా తేల్చి.. దోషులకు శిక్షలు ఖరారు చేసింది. అయితే కోర్టు సోమవారం తుది తీర్పు ప్రకటించనుంది.

 

కాగా 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు జంట పేలుళ్లకు పాల్పడిన విషయం విదితమే. పేలుళ్లలో 18 మంది ప్రాణాలు కలోపోగా, 138 మంది గాయపడ్డారు. ఈ కేసులో రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లు నిందితులుగా ఉన్నారు. వీరిలో రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu