బ్రాహ్మణులను కించ పరచలేదు: బ్రహ్మానందం

Dhenikaina Ready, Dhenikaina Ready controversy, Dhenikaina Ready mohanbabu, Brahmanandam apologizes

 

దేనికైనా రెడీ సినిమాలోని పలు సన్నివేశాల్లో ఉన్న నటుడు బ్రహ్మానందం తాజాగా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పారు. ‘‘ఆ సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ ఏవైనా సన్నివేశాలు ఉన్నట్లు భావిస్తే తాను క్షమాపణలు చెబుతున్నానని, అయినా ఆ చిత్రంలో తాను బ్రాహ్మణుడిగా నటించలేదని..’’ బ్రహ్మానందం తెలిపారు. ఆ సన్నివేశాలు బ్రాహ్మణులను నొప్పించాయని తాను అనుకోవడం లేదని అన్నారు.

 

దేనికైనా రెడీ చిత్రంపై ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం సినిమా వీక్షించారు. ఈ చిత్రంలో బ్రాహ్మణులను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తేల్చారు. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు, సంభాషణలను నమోదు చేశామని, వీటిపై శుక్రవారం చిత్రనిర్మాత మోహన్‌ బాబు, హీరో విష్ణును పిలిపించి చర్చిస్తామని కమిటీ ఛైర్మన్‌ రేమండ్‌ పీటర్‌ తెలిపారు. అయితే తాజాగా హైకోర్టు స్టే విధించడంతో ఈ కమిటీ నివేదికను పరిగణలోకి తీసుకోరని స్పష్టం అవుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu