డిసెంబరులో మ్యారేజ్...?

                                                      Vidya Balan Siddharth Roy, Vidya Balan marriage, Vidya Balan wedding, Vidya Balan marriage wedding

 

 

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తన మ్యారేజ్ పై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఇందుకు సంబంధించి పనులు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో మరో హై ప్రొఫైల్ వెడ్డింగ్ జరగబోతోంది. ఈ ఏడాదిలో సైఫ్ కరీనాల పెళ్ళి తర్వాత ఆ తరహాలో మరొకటి జరగబోతోంది.  చాన్నాళ్ళ గా యుటీవి డిస్నీ సిఈఓ సిద్ధార్థరాయ్ కపూర్ తో డేటింగ్ చేసిన విద్యాబాలన్, వీలైనంత తొందరగా మ్యారేజ్ చేసుకునె పనిలో పడింది.

 

                                                    Vidya Balan Siddharth Roy, Vidya Balan marriage, Vidya Balan wedding, Vidya Balan marriage wedding



ఈ ఏడాది చివర్లో ఎంగేజ్ మెంట్ కానిచ్చి తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని ఈ జంట భావించింది. అయితే ఇంతలోనే ఈ జంట వీలైనంత తొందరగా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ లోగా విద్యా కూడా తన సినిమాలను పూర్తి చేసే పనిలోవున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా సిద్ధార్థ రాయ్ కపూర్ డిసెంబర్ నేలంతా లీవ్ పెట్టడం ఇందుకు బలం చేకూరుతోంది. ఎంగేజ్ మెంట్ ఒకవారం సరిపోతుందని నేలంతా లీవ్ పెట్టడంతో పెళ్ళి పనుల్లో నిమగ్నమైనట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈవార్తలపై  ఆ జంట ఏమంటుందో...?  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu