ఆందోళ‌న కారుల‌కు డిజిపి వార్నింగ్‌

 

తెలంగాణ ప్రక‌ట‌న‌తో ఇరుప్రాంతాల్లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. దీంతో ప‌రిస్థితుల‌ను కొలిక్కి తీసుకొచ్చేందుకు డిజిపి దినేష్ రెడ్డి ప్రెస్‌మీట్ నిర్వహించి హెచ్చరిక‌లు జారీ చేశారు. త్వర‌లో ఉద్యమం మ‌రింత ఉదృతం అవుతుంద‌న్న ఆందోల‌న కారుల హెచ్చరిక‌ల నేప‌ధ్యంలో దినేష్ రెడ్డి పోలీసులు ఉద్యమ‌కారులపై వ్యవ‌హ‌రించే తీరుపై మాట్లాడారు.

రైల్ రోకో లాంటి ఆందోల‌న‌లు చేప‌డితే క‌ఠినమైన శిక్షలు ప‌డ‌తాయ‌ని హెచ్చరించారు. అంతేకాదు జాతీయ‌నాయ‌కులు విగ్రహాలు ద్వంసం చేయడం కూడా తీవ్రమైన నేరం అన్న ఆయ‌న అలాంటి త‌ప్పుల‌కు క‌నీసం మూడేళ్ల జైళు శిక్ష ప‌డుతుంద‌న్నారు. ప్రజ‌ల ధ‌న మాన ప్రాణాల‌ను కాపాడ‌మే పోలీసుల క‌ర్తవ్యం అన్నారు.

విభ‌జ‌న స‌మైక్య ఉద్యమాల‌ నేప‌ధ్యంలో పోలీసులపై విమ‌ర్శలు చేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.. ఈవిష‌యంలో మీడియా కూడా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. పోలీసులకు అన్ని ప్రాంతాల వారు స‌మాన‌మేనని వారు ఎవ‌రికి సాయంగానే, ఎవ‌రి పై క‌క్షపూరితంగానో ప‌ని చేయ‌ర‌ని చెప్పారు.

సీమాంద్రులు ప్రజాస్వామ్య ప‌ద్దతుల్లో ఎలాంటి ఉద్యయం అయినా చేసుకోవ‌చ్చన్న ఆయ‌న ప్రజాస్వామ్య ప‌ద్దతుల్లో ఎవ‌రు నిర‌స‌న‌లు తెలిపిన తాము అడ్డుచెప్పమ‌న్నారు.