తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం (జూన్ 23) శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండియపోయి భక్తుల క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.

ఇక టైమ్ స్లాట్ దర్శనానికి దాదాపు 6 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల వ్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది.  ఆదివారం (జూన్ 22) స్వామివారిని మొత్తం 87 వేల 254 మంది దర్శించుకున్నారు. వారిలో 33 వేల 777 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 28 లక్షల రేపాయలు వచ్చింది.