తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమల కొండపైకి శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

శుక్రవారం శ్రీవారిని 79వేల 486 మంది భక్తులు దర్శించుకున్నారు.  40వేల 250 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 72లక్షల రూపాయలు వచ్చింది.

 ఇక శనివారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో  కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలేన్లు టీబీసీ వరకూ  వచ్చాయి. కాగా టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది.