తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరమల శ్రీవారిని 78వేల 30 మంది దర్శించుకున్నారు.

35వేల 860 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చింది. ఇక బుధవారం ఉదయం నుంచీ శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.