హనుమకొండ కోర్టు ఆవరణలో డిటొనేటర్లు

 

హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో ఆరు డిటొనేటర్లు లభ్యమయ్యయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదరింపు కాల్ రావడం, తనిఖీలు చేపట్టిన పోలీసులకు డిటొనేటర్లు లభ్యం కావడంతో లాయర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ఇటీవలి కాలంలో హనుమకొండ కోర్టుకు బాంబు బెదరింపు రావడం ఇది మూడో సారి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu