డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు
posted on Jul 2, 2025 2:40PM
.webp)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. గత నెలలో మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో నిబంధనలు ఉల్లంఘించారని అడ్వకేట్ వాంజినాతన్ పోలీసులకు 3. 196(1)(a), 299, 302, and 353(1)(b)(2) సెక్షన్ల కింద అన్నానగర్ పోలీసులు పవన్, అన్నామలైతో పాటు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఏఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
జూన్ 22వ తేదీన మదురైలో నిర్వహించిన మురుగన్ భక్తుల కాన్ఫరెన్స్ మీటింగులో మత విద్వేషాలు రేకెత్తించేలా ప్రసంగించారని పవన్ కళ్యాణ్, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై మదురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యునల్ హార్మొనీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముదులో మురుగన్ భక్తుల సదస్సు జరగడానికి ముందే ఆంక్షలు విధించినా, వాటిని పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారన్నది ప్రధానంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సభ పేరుతో అనుమతి పొంది, రాజకీయ, మతపరమైన ప్రసంగాలు చేయరాదన్న హైకోర్టు షరతును నిర్వాహకులు ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపారు