మిస్టర్ కూల్ బ్రాండ్ ఓన్ చేసుకున్న ధోనీ
posted on Jul 2, 2025 2:37PM

మహేంద్ర సింగ్ ధోని.. ఏ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని పేరు ఇది. ఎస్పెషల్లీ క్రికెట్ ఫ్యాన్స్‌కు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించడమే కాదు.. సిట్యూవేషన్ ఏదైనా తన కూల్‌ను కోల్పోకుండా టీమ్‌ను విజయాల బాట పట్టించాడు ధోని. అందుకే అంతా కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పుడా పేరును ఏకంగా ట్రేడ్‌మార్క్‌గా మార్చుకున్నారు ధోని.
నిజానికి కెప్టెన్ కూల్ అనగానే ధోనినే గుర్తొస్తాడు. అందుకే ఈ మార్క్‌ను అఫిషియల్‌గా దక్కించుకున్నాడు ధోని. దీని కోసం 2023 జూన్ 5న అఫిషియల్‌గా అప్లై చేసుకున్నాడు. 2025 జూన్ 16న అతని అప్లికేషన్‌ను యాక్సెప్ట్ చేశారు. నిజానికి ఈ టైటిల్ ఎప్పుడో రావాల్సింది. కానీ కొన్ని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇంత ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అతని ఆశ నెరవేరింది. ట్రెడ్‌మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ధోని అప్లికేషన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సో.. ఇక అఫిషియల్‌గా కెప్టెన్ కూల్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ధోని.
మరి ఈ ట్యాగ్ లైన్ ధోనికి ఎందుకు? ధోనికి దీంతో ఏం అవసరం ఉంది? అనేది ఇప్పుడు అసలు క్వశ్చన్. ధోని స్పోర్ట్స్ ట్రైనింగ్, కోచింగ్ సర్వీస్, ట్రైనింగ్ సెంటర్ల కోసం ఈ టైటిల్‌ను వాడుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే అనేక బిజినెస్‌ల్లో డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంది ధోనికి. ఇకపై ఈ ట్యాగ్‌లైన్‌తో బిజినెస్ చేసుకోవచ్చు .
ధోనికి ఫ్యాషన్, ఫిట్‌నెస్, టెక్నాలజీ, హాస్పిటాలిటి రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. చాలా కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టాడు. మాములుగానే ధోని అంటే ఓ బ్రాండ్.. ఇప్పుడు ఆ బ్రాండ్‌కు తోడుగా కెప్టెన్ కూల్ అనే ట్యాగ్ కూడా యాడ్ అయ్యింది. దీంతో ఆయన నెట్‌వర్త్ త్వరలో మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 2024 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆయన నెట్‌వర్త్ అటు ఇటుగా వెయ్యి కోట్లుగా ఉందని తెలుస్తోంది.
ముఖ్యంగా స్పోర్ట్స్, ఫిట్‌నెస్ ఏరియాలో ఈ ట్యాగ్‌లైన్‌ను ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోకముందే చాలా వ్యాపారాలు మొదలుపెట్టడంతో పాటు.. పెట్టుబడులు కూడా పెట్టాడు మాహీ. ఇక రిటైర్మెంట్ తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగింది.ధోనికి సెవెన్ అనే బ్రాండ్ ఉంది. ఇది ధోని సొంత స్పోర్ట్స్ వేర్ అండ్ ఫుట్ వేర్ కంపెనీ. దీనికి అతను బ్రాండ్ అంబాసిడర్ మాత్రమే కాదు.. కో ఓనర్ కూడా. చెన్నైయిన్ ఎఫ్‌సీ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు ధోని కో-ఓనర్. ఇక రాంచీ రేస్ అనే హాకీ ఇండియా లీగ్‌లోని ఓ హాకీ జట్టుకు కూడా ధోని కో ఓనర్. సూపర్ బైక్ రేసింగ్ టీమ్ కూడా ఉంది ధోనికి. మహి రేసింగ్ టీమ్ ఇండియాలో ధోని వాటాదారుడుగా ఉన్నారు.
ఇక స్పోర్ట్స్‌ఫిట్‌లో పెట్టుబడులు పెట్టాడు. స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా 200కి పైగా జిమ్‌లు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటిలో ధోని కెప్టెన్ కూల్ అనే ట్యాగ్‌లైన్‌ను ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా వాడుకోవచ్చు. ఇవి కాకుండా ఖాతాబుక్, గరుడ ఏరోస్పేస్, కార్స్ 24, ఈమెటో రైడ్‌లాంటి కంపెనీల్లో ధోని పెట్టుబడులు పెట్టాడు. ఇవి మాత్రమే కాదు సెవన్ ఇంక్‌బ్రూస్ అనే ముంబైకి చెందిన ఫుడ్ అండ్ బెవరేజ్ స్టార్టప్‌లో కూడా పెట్టుబడులు పెట్టారు.
ధోని ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఓ సినిమా సంస్థను కూడా స్థాపించారు. మాహి రెసిడెన్సీ పేరుతో రాంచీలో ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ అయిన రితి గ్రూప్‌లో పెట్టుబడులు.. ఇంటర్నల్ డిజైన్ బ్రాండ్ హోమ్‌లేన్.. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బ్రాండ్ శాఖహారి సంస్థల్లో కూడా ధోని పెట్టుబడులు పెట్టాడు. బెంగళూరులో ఎంస్ ధోని గ్లోబల్ స్కూల్ నిర్వహిస్తున్నారు. సో.. ధోని కెప్టెన్ కూల్ అనే ట్యాగ్ కోసం పోరాడింది తన వ్యాపార సామ్రాజ్యానికి చాలా హెల్ప్ అవుతుందనేది మనకు అర్థమవుతోంది.