చనిపోయిన పోలీసుకి బదిలీ
posted on Feb 25, 2016 3:13PM
.jpg)
అమిత్ కుమార్ సింగ్! దిల్లీ పోలీసు శాఖలో అసిస్టెంట్ పోలీస్ కమీషనర్. 30 ఏళ్ల అమిత్ మూడునెలల క్రితం ఏదో బాధలో తనని తాను కాల్చుకుని చనిపోయాడు. అతను చనిపోయిన కొద్దిసేపటికి అమిత్ భార్య కూడా తమ అపార్టుమెంటు మీద నుంచి కిందకి దూకి చనిపోయింది. ఈ భార్యాభర్తల ఆత్మహత్య దిల్లీలోనే పెనుసంచలనం సృష్టించింది. అయితే ప్రభుత్వ హోంశాఖ చేసిన పనికి అమిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడిని లక్షద్వీప్‌కు బదిలీ చేస్తూ ఈ వారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. పైగా ఒకవేళ సమయానికి డ్యూటీలో చేరకపోతే, క్రమశిక్షణ చర్యలను తీసుకోవలసి వస్తుందంటూ హెచ్చరికలను కూడా జోడించింది. ఇదేం పనంటూ హోంశాఖ అధికారులను సంప్రదించగా తమ ఉద్యోగుల చావు పుట్టుకల గురించి చూసుకునే విభాగం వేరు, బదిలీల గురించి చూసే విభాగం వేరు అంటూ జారుకున్నారు అధికారులు.