దావూద్ గురించి రహస్య సమాచారం ఉంది.. మోడీకి మాత్రమే ఇస్తా..
posted on May 2, 2016 11:27AM
.jpg)
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి మన ప్రభుత్వం తలలు పట్టుకుంటుంటే.. దావూద్ గురించిన విలువైనరహస్య సమాచారం తన వద్ద ఉందని గుజరాత్ కు చెందిన మనీష్ భాంగోరే చెబుతున్నారు. దావూద్ మాట్లాడిన ఫోన్ కాల్స్ రికార్డు చేసిన సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి.. కానీ ఈ రహస్య సమాచారం ఎవరికి తెలుపను.. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాత్రమే ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే.. ఈ సమాచారాన్ని సేకరించేందకు నేను నా జీవితాన్నే పణంగా పెట్టాను.. ఎంతో కష్టపడి సమాచారం సేకరించాను.. అయితే మొదట వడోదరా పోలీసులు ఈ విషయంలో సహకరించారు కానీ.. ఆతరువాత వేధించడం మొదలుపెట్టారు.. తాను తప్పుడు ప్రచారం చేస్తున్నానని పోలీసు కమిషనర్ ఈ రాధాకృష్ణన్ అసత్యాలు చెబుతున్నారు అని ఆరోపించారు. మోడీ కలవడానికి ఎన్నో సార్లు ఆయన కార్యాలయం చుట్టూ తిరిగా.. ఎన్నో సార్లు మోడీని కలవాలని ప్రయత్నించినా కుదరలేదు అని.. ఒక్కసారి అవకాశం ఇస్తే ఆయనను కలిసి తన వద్ద ఉన్న సాక్ష్యాలు అప్పగిస్తానని అన్నాడు. ఒకవేళ తన వద్ద ఉన్న సమాచారం తప్పని తెలిస్తే ఉరితీయాలని మనీష్ వ్యాఖ్యానించాడు.