దండుపాళ్య౦ 100 డేస్
posted on May 5, 2013 12:00PM

కన్నడలో సూపర్ హిట్ అయి 25 కోట్ల రూపాయల షేర్ సాధించిన ‘దండుపాళ్య’ చిత్రం తెలుగులో ‘దండుపాళ్యం’గా విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించి సూపర్‌హిట్ అవడమే కాకుండా 18 సెంటర్స్‌లో యాభై రోజులు, 2 సెంటర్స్‌లో వంద రోజులను పూర్తి చేసుకుంది. యధార్థ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీనివాసరాజు తెరకెక్కించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకుడు శ్రీనివాసరాజు, నిర్మాత వెంకట్, రచయిత దర్శకుడు కె.ఆర్.కె.రాజు, కెమెరామెన్ వెంకట్ ప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్ సాయి, కో-డైరెక్టర్ రమేష్, పి.ఆర్.ఓ. బి.ఎ.రాజు తదితరులు పాల్గొన్నారు. త వెంకట్ మాట్లాడుతూ – ”భారత చలనచిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సమయంలో ‘దండుపాళ్యం’ చిత్రం రెండు సెంటర్స్‌లో హండ్రెడ్ డేస్ పూర్తయి ఇదేరోజు వంద రోజుల ఫంక్షన్ జరగడం చాలా ఎగ్జైటింగ్‌గా వుంది భక్త సిరియాళ్, పోలీస్‌స్టోరీ చిత్రాల తర్వాత మా ‘దండుపాళ్యం’ చిత్రం వందరోజులు ఆడింది. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ – ”1913 మే 3కి ఇండియన్ ఫిల్మ్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవటం ఈ అకేషన్‌లో మా సినిమా వందరోజులు ఫంక్షన్ జరగడం మంచి అవకాశంగా భావిస్తున్నాం. మంచి సినిమాతో నా ఎంట్రీ వుండాలనుకున్నా అని అన్నారు.