ఔటయినా ఇవ్వలేదు...

 

ప్రపంచకప్ క్రికెట్లో భాగంగా గురువారం సిడ్నీలో భారత - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరొన్ ఫించ్ 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్బీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతను ఔటయినా అంపైర్ ఇవ్వలేదు. స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 23వ ఓవర్ ౩వ బంతికి ఫించ్ ఎల్బీ అవుటయ్యే అవకాశం ఉండగా అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. కానీ ధీమాగా ఉన్న జడేజా, కెప్టెన్ ధోనీని రివ్యూ తీసుకుందామన్నాడు. రివ్యూలో ఫించ్ అవుటన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ ఫలితం నాటౌట్ గా అంపైర్లు తేల్చారు. దీంతో భారత ఆటగాళ్లు కాస్త నిరాశ చెందారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu