అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల అరెస్టు

 

తెలంగాణ అసెంబ్లీ లాబీల్లోకి అనుమతించకుండా తెలుగుదేశం ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు, మార్షల్స్‌కి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అసెంబ్లీ ఆవరణలో టీ టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. గన్‌పార్క్ వద్ద తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రమణను పోలీసులు అడ్డుకున్నారు. తమను అక్రమంగా శాసనసభ నుంచి సస్పెండ్ చేయడానికి నిరసిస్తూ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గత కొద్ది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాడు ఎమ్మెల్యేలు స్పీకర్ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించినా ఇవ్వలేదు. ఇప్పుడు అసెంబ్లీ ఆవరణలోనే వారిని అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu