పోటీకి సిద్ధపడుతున్న సిపిఐ (ఎం.ఎల్-లిబరేషన్)

విశాఖ జిల్లా పాయకరావుపేట ఉప ఎన్నికల్లో పోటీకి సిపిఐ (ఎం.ఎల్.) లిబరేషన్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ పార్టీకి గిరిజన ప్రాంతాల్లో గట్టి పట్టు ఉంది. గత ఇరవై ఏళ్ళుగా ఈ పార్టీ పాయకరావు పేట గ్రామీణ ప్రాంతాల్లో భూసమస్యలు, గిరిజన సమస్యలపై అనేక పోరాటాలు చేసింది. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి పలుమార్లు తెచ్చింది. గతంలో ఈ పార్టీ 1990, 2004 ఎన్నికల్లో ఈ నియోజక వర్గంలో పోటీ చేసింది. ఈ పార్టీకి ఎన్నికల్లో గెలిచే సత్తా లేకపోయినప్పటికి ఈసారి ఎనిమిది నుంచి పదివేల ఓట్ల వరకూ తెచ్చుకునే సత్తా వుంది. దీనికి తోడు తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వవలసిందిగా సిపిఐ, సిపిఎం పార్టీలను కోరుతోంది. ఈ పార్టీలు గనుక లిబరేషన్ కు మద్దతు ఇస్తే వీరు చీల్చుకునే ఓట్ల మేరకు ప్రధాన పార్ట్టీ అభ్యర్థుల వోట్లకు గండిపడటం ఖాయం. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఇతర ప్రధాన పార్టీలకు గట్టిపోటీ నివ్వడం ఖాయమని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నైనాల శెట్టి మూర్తి అంటున్నారు. అయితే ఈ పార్టీకి మావోయిస్టు సానుభూతి పరులు మద్దతు పలికే ప్రమాదముందని జిల్లా పోలీసులు భయపడుతున్నారు.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu