లేడీ డాన్ అరుణకు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు

లేడీ డాన్ అరుణకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నెల్లూరు కోర్టు నుంచి జైలుకు తరలించారు. తన ప్రియుడు, రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయడంలో చక్రం తిప్పిందన్న ఆరోపణలపై అరుణను పోలీసులు బుధవారం (ఆగస్టు 20)అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్టు చేస్తారని ముందుగానే ఊహించిన అరుణ హైదరాబాద్ కు పరారౌతుండగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద అదుపులోనికి తీసుకున్నారు.  

ఈ సందర్భంగా అరుణ తన కారులో గంజాయి పెట్టి  తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందంంటూ కారులోంచే సెల్పీలు తీసుకుంటూ  మీడియా, సోషల్ మీడియాకు విడుదల చేశారు. ఆ సందర్భంగా పోలీసులపై పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఆమెను పోలీసులు నెల్లూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu