చెలరేగిపోయిన దొంగలు...

 

వరంగల్ జిల్లాలోని ములుగులో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. 20 ఇళ్ళని ఏకకాలంలో దోచేసి తమ సత్తాని, జనం భయాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరూపించారు. శుక్రవారం తెల్లవారుఝామున ములుగు ప్రాంతంలోని ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, లక్ష నగదును అపహరించారు. దోపిడీ దొంగలను అడ్డుకునే ప్రయత్నం చేసిన దంపతులను దోపిడీ దొంగలు ఇనుప రాడ్లతో బలంగా కొట్టడంతో వారికి తీవ్ర గాయాలు తగిలాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. గత నెలలో వరంగల్ జిల్లాలోనే ఇదే తరహా దోపిడీ జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu