భార్యాభర్తలని నరికారు

 

పాతకక్షలు దంపతులను బలి తీసుకున్నాయి. కడప జిల్లాలోని తొండూరు మండలం ఆగడూరు గ్రామంలో పాత కక్షలతో ప్రత్యర్థులు పకీరయ్య, పకీరమ్మ అనే దంపతులను నరికి చంపారు. ఈ సంఘటన కడప జిల్లాలో సంచలనం సృష్టించింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కడప జిల్లాల్లో ప్రతీకార హత్యలు తగ్గుముఖం పట్టాయని పోలీసులతోపాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో జరిగిన ఈ జంట హత్యలు ఈ ప్రాంతంలో కలవరం రేపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu