కరోనా రోగి పారిపోయాడు! ఆచూకీ చెబితే 50వేల బహుమతి!

పారిపోయిన కరోనా రోగిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. అత‌నికి సంబంధించి బంధువుల ఇళ్ల‌న్నీ గాలిస్తున్నారు. అయినా ఆ ద‌రిద్రుడు దొర‌క‌క‌పోవ‌డంతో అత‌న్ని ప‌ట్టిచ్చిన వారికి 50 వేల రూపాయ‌ల న‌గ‌దు బ‌హుమ‌తి ఇస్తామ‌ని డీజీపీ ప్ర‌క‌టించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన జావేద్ ఖాన్‌కు జరిపిన పరీక్షల్లో కరోనా వైరస్ పాజిటివ్ అని రావడంతో అతన్ని జబల్‌పూర్ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. వైద్యకళాశాల ఆసుపత్రిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ వారి కళ్లు గప్పి కరోనా రోగి జావేద్ ఖాన్ పారిపోయాడు.

ఆసుపత్రి నుంచి పారిపోయిన కరోనా రోగి ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల నగదు బహుమతి ఇస్తామని మధ్యప్రదేశ్ డీజీపీ వివేక్ జోహ్రీ ప్రకటించారు. అంతే కాదు కరోనా రోగి పారిపోయేందుకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరుతో పాటు నలుగురు పోలీసు గార్డులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

పారిపోయిన కరోనా రోగిని పట్టుకునేందుకు పోలీసులు ప్ర‌త్యేక బృంధాలుగా ఏర్ప‌డి గాలిస్తున్నారు. కరోనా రోగి పారిపోయినందున స్థానిక‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జబల్ పూర్ జిల్లా మెజిస్ట్రేట్ భరత్ యాదవ్ హెచ్చ‌రించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu