పేర్ని నాని పిట్టకథ వైఎస్సార్-జ‌గ‌న్‌ల గురించేగా? నిజం చెప్పాలే!!

మంత్రి పేర్ని నాని గురించి తెలుసుగా. చాలా చ‌క్క‌గా మాట్లాడ‌తారు. కాలికేస్తే మెడ‌కు.. మెడ‌కేస్తే కాలికేస్తారు. మ‌రో నానిలా బూతులు మాట్లాడ‌కుండా.. నీట్‌గా మెలికేస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రెస్‌మీట్లు పెడుతూ.. జ‌గ‌న‌న్న‌ను, వైసీపీ ప్ర‌భుత్వాన్ని బాగా క‌వ‌ర్ చేస్తుంటారు. స‌జ్జ‌ల కంటే పేర్ని నానినే బెట‌ర్ అనే విధంగా మాట్లాడతారు. అందుకే, పేర్ని ప్రెస్‌మీట్‌కి మీడియా క‌వ‌రేజ్ ఎక్కువ‌. ఇంత‌కీ మాట‌ర్ ఏంటంటే.. వివ‌రాల్లోకి వెళ్లే ముందు ఈ లింక్ ఓసారి ఓపెన్ చేసి పేర్ని నాని అస‌లేమ‌న్నారో ఓసారి వినండి...

పేర్ని నాని పిట్టకథ-- https://youtu.be/Ky2BKbi503o

విన్నారుగా.. పేర్ని నాని గారి పిట్ట‌క‌థ‌. అది విన్నాక మీకు వెంట‌నే ఎవ‌రు గుర్తొచ్చారు. నిజాయితీగా చెప్పాలంటే.. ఆ తండ్రీకొడుకులు వైఎస్సార్‌-జ‌గ‌న్‌లు అనిపించ‌డం లేదు. మీకే కాదు.. ఈ పేర్ని నాని పొడుపు క‌థ విన్న‌వారంద‌రికీ.. నాని గారు ఎద్దేవా చేస్తున్న‌ది వైఎస్సార్‌, జ‌గ‌న్‌ల‌నే అనుకున్నారు. నిజం చెప్పాలంటే.. పేర్ని నాని త‌న మ‌న‌సులో మాట‌ను అలా బ‌య‌ట‌పెట్టారు. ఫ్లోలో అలా వ‌చ్చేసి ఉంటుంది. 

క‌థ మొత్తం చెప్పేశాక‌.. ఆయ‌న‌కే డౌట్ వ‌చ్చేసింది. అందుకే, వెంట‌నే అది మ‌రొక‌రి మీద‌కు షిఫ్ట్ చేసేశార‌నుకోండి అది వేరే విష‌యం. ఏది ఏమైనా మంత్రి పేర్ని నాని చెప్పిన పిట్ట‌క‌థ మాత్రం ఆ తండ్రీకొడుకులకు బాగా సూట్ అవుతుంద‌ని సోష‌ల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైర‌ల్ చేస్తున్నారు. 

అప్ప‌ట్లో వైఎస్సార్ దుష్ట‌పాల‌న భ‌రించ‌లేకే.. 2009లోనే టీడీపీకి ప‌ట్టం క‌ట్ట‌బోయారు ప్ర‌జ‌లు. కానీ, చిరంజీవి ప్ర‌జారాజ్యం రూపంలో వైఎస్‌కు పెద్ద మేలు చేశారు. ఆ త‌ర్వాత అందుకు ప్ర‌తిఫ‌లంగా రాజ్య‌స‌భ‌, కేంద్ర మంత్రి ప‌ద‌వి పొందార‌నుకోండి. ఆనాడు వైఎస్సార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అడ్డుపెట్టుకొని.. కొడుకు జ‌గ‌న్‌రెడ్డి చేసిన ధ‌న‌యజ్ఞం అంతాఇంతా కాద‌ని సీబీఐ, ఈడీ అంటోంది. విజ‌య‌సాయిరెడ్డితో క‌లిసి అడ్ర‌స్ లేని సూట్‌కేసు కంపెనీలు పెట్టి.. వేల కోట్లు అక్ర‌మంగా సంపాదించార‌ని కేసులు పెట్టింది. ఆ కేసుల విచార‌ణ‌లో.. ప్ర‌స్తుం బెయిల్ మీద బ‌య‌ట ఉండి.. ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అనుభ‌విస్తున్నారు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. కొడుకు పాల‌న చూశాక‌.. తండ్రి పాల‌నే బెట‌ర్ అనిపిస్తోంద‌ని అంటున్నారు. ఈ విధంగా.. మంత్రి పేర్ని నాని చెప్పిన పొడుపు క‌థ‌.. వైఎస్సార్‌, జ‌గ‌న్‌ల‌కు అతికిన‌ట్టు స‌రిపోతుంద‌ని అంటున్నారు. అందుకే, సోష‌ల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు. మీకేమైనా డౌట్ ఉంటే.. పేర్ని నాని మాట‌లు మ‌రోసారి వినేయండి.. కామెంట్ బాక్స్ లో ఓ కామెంట్ పెట్టేయండి...

పేర్ని నాని పిట్టకథ-- https://youtu.be/Ky2BKbi503o