కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల... రైతులకు 24 గంటల విద్యుత్,  2 లక్షల ఉద్యోగాల భర్తీ, 4వేల పెన్షన్ 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. 62 ప్రధాన అంశాలతో ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. దీనికి అభయహస్తం అనే పేరు పెట్టింది. 42 పేజీలతో ఈ మేనిఫెస్టోని రూపొందించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేనిఫెస్టోని గాంధీభవన్‌లో రిలీజ్ చేశారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల అంశమైన 24 గంటల విద్యుత్ సరఫరాపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలను బిఆర్ఎస్ వక్రీకరించదని అప్పట్లో రేవంత్ స్పష్టం చేశారు. అయినా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ మేనిఫెస్టో పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చినట్టయ్యింది. జాబ్ కేలండర్, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ,వయోజనులకు 4 వేల పెన్షన్  వంటి అంశాలు కీలకమైనవిగా ఉన్నాయి.

ప్రతి ఒక్కరికీ మేలు చేసేలా ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఈ మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా కాంగ్రెస్ అభివర్ణించింది. ఇందులో ఇదివరకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలతోపాటూ.. మరికొన్ని కీలక అంశాలను చేర్చింది. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేష్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లను మొదటి 16 పేజీలలో కాంగ్రెస్ తెలిపింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu