ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ మట్టి సత్యాగ్రహం
posted on Nov 6, 2015 5:18PM

కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా నేతలు మొత్తం 17 తీర్మానాలను ఆమోదించారు. అంతేకాదు ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రత్యేక హోదా గురించి చర్చించినట్టు తెలుస్తోంది. దీనిలోభాగంగానే కేంద్రం తక్షణం ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేయాలంటూ ఈ నెల 9, 10 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, 15 నుండి 20 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో మట్టి సత్యాగ్రహాలు నిర్వహించాలని నిర్ణయించున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సి. రామచంద్రయ్య మాట్లాడుతూ.. కాపులను బీసీలోకి చేర్చాలన్న చిత్తశుద్ది చంద్రబాబుకు లేదని.. పుట్టస్వానికమిషన్ నివేదిక ద్వారా కాపులకు రిజర్వేషన్లు కల్పించవచ్చని.. చంద్రబాబు కావాలనే కాలయాపన చేస్తున్నారని అన్నారు.