జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హ్యాండిచ్చినట్లేనా?

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంఎల్సీ జీవన్ రెడ్డికి పార్టీ హ్యాండిచ్చినట్లే కనిపిస్తోంది. నిజామాబాద్ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డికి మరోసారి ఆ చాన్స్ ఇచ్చే విషయంలో అధిష్ఠానం సుముఖంగా లేదని అంటున్నారు. పార్టీ సీనియర్ నాయకుడిగా త్వరలో జరగనున్న నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారని అంతా భావించారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  కూడా ఇటీవల మీడియాతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడుతూ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో జీవన్ రెడ్డి వినా మరో పేరు అసలు పరిశీలనలోనే లేదన్నారు.  

వాస్తవానికి జీవన్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చి వరకూ ఉన్నప్పటికీ ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం అంటే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉంటారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికే మరోసారి అవకాశం అని అంతా   భావించారు. అయితే చివరి నిముషంలో అనూహ్యంగా తెరపైకి నరేందర్ రెడ్డి, ప్రసన్నహరికృష్ణ, వెల్చాల రాజేందర్ రావు,  గంగాధర్  పేర్లు తెరపైకి వచ్చాయి. నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ కొత్తగా వీరి పేర్లు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరిలో నరేందర్  ఆల్ఫోన్స్ విద్యాసంస్ధల అధినేత కాగా, ప్రసన్నహరికృష్ణ, వెల్చాల రాజేందర్ రావు పార్టీలో సీనియర్ నేతలు, ఇక గంగాధర్ మాజీ డీఎస్పీ. తొలి నుంచీ కాంగ్రెస్ లో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని కాదని వేరే వారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలంచడంపై పార్టీ శ్రేణుల్లోనే విస్మయం వ్యక్తం అవుతోంది.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu