బోగ్గు ఫైళ్లకు నేను కాపాలా కాదు : ప్రదాని
posted on Aug 31, 2013 7:27AM

కోల్ స్కాం విషయంలో ప్రతిపక్షాలతో పాటు సుప్రిం కోర్టు కూడా ఫైళ్ల మాయంపై మండి పడటంతో ఎట్టకేలకు ప్రదాని మన్మోహన్ సింగ్ విషయం పై నోరు విప్పారు. బొగ్గు బ్లాకుల కేటాయింపుల విషయంలో బిజెపి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రదాని సమాధానమిచ్చారు.
దేశంలో అవినీతి ఎప్పటినుంచో ఉందన్న ప్రదాని సమాచార హక్కు లాంటి చట్టాల వల్ల ఇటీవల అది బాగా వెలుగులోకి స్తుందన్నారు. సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో బొగ్గు శాఖ ఫైళ్లు ఎలా మాయం అయ్యాయని విపక్షాలు ప్రశ్నించగా వాటికి నేను కాపాలా కాదు. ఎలా పోయాయో విచారణ అనంతరం తెలుస్తుందని ఘాటుగా స్పందించారు.
అయితే ఆర్థిక వ్యవస్థ ప్రదాని చేసిన వ్యాఖ్యలతో పాటు బొగ్గు ఫైళ్ల మిస్సింగ్ విషయంలో కూడా ప్రదాని సంతృప్తి కరమైన సమాధానం ఇవ్వటంలో విఫలమయ్యారన్ని ప్రతిపక్షాలు ఆరోపించాయి.