రాజీనామాల పై రాజీ
posted on Aug 30, 2013 8:57PM

సీమాంద్రలో జరుగుతున్న ఉద్యమాలకు మద్దతుగా తాము కూడా రాజీనామాలు చేస్తామంటు ప్రకటించిన సీమాంద్ర నాయకులు ఇప్పుడ మాట మారుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఉద్యొగ సంఘాల వత్తిడితో అప్పుడు రాజీనామాలకు ఒకే అన్నా ఇప్పుడు మాత్రం రాజీనామ చేయడానికి చాలామంది నేతలు సుముఖంగా లేరట.
ఉద్యోగసంఘాలతో జరిగిన సమావేశంలో నేతలు తల ఒక రకంగా మాట్లాడు, కొంత మంది మేం ఇప్పటికే రాజీనామ చేశాం అని చెప్పగా మరి కొంత మంది మాత్రం, రాజీనామాలతో ఒరిగేదేమి లేదన్నారు. మరికొంత మంది ఉద్యోగ సంఘాల వత్తిడితో రాజీనామ చేయడానికి అంగీకరించారు.
అయితే అప్పుడు రాజీనామ చేస్తా అన్నవారు. గతంలోనే రాజీనామ చేసిన నాయకులు కూడా తమ రాజీనామాలను ఆమోదింప చేసుకోవటానికి సుముఖంగా లేరట. తాము సభలోనే ఉండి తెలంగాణ బిల్లు పై తమ వ్యతిరేఖతను తెలియజేస్తాం అంటూ మాట మారుస్తున్నారట. మరి ఈ నాయకుల నిర్ణయంపై ప్రజా సంఘాల వారు ఎలా స్పందిస్తారో చూడాలి.