సీఎం రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడు..ఇక బీజేపీనే రక్షణ : కిషన్‌రెడ్డి

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పులు ఇచ్చేవారు లేరని, నన్ను ఎవరు నమ్మేవాడు లేడని  చేతులెత్తేశాడని కేంద్ర మంత్రి అన్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి స్వ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.. త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, ఒక కుటుంబం బారినపడి ఏ రకంగా బలి అయ్యామో మనకు తెలుసన్నారు. ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కిషన్ రెడ్డి అన్నారు. 

ఇక గడిచిన ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే  ఆరు గ్యారెంటీల పేరుతో మోసిందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో అనేక హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.  పరిపాలన చేతకాక, హామాలు అమలు చేయలేక కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో చేతులెత్తేసిందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.అవినీతి పాలనతో, దోపిడీ, కుంభకోణాలతో, అహంకారంతో, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారో చూశామన్నారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బీఆర్​ఎస్​ పార్టీ ఏ రకంగా పనిచేసిందో మనం చూశామని చెప్పుకొచ్చారు.