సీఎం రేవంత్ ఇంటి ప్రహారీగోడ కూల్చివేత!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ప్రహారీగోడను అధికారులు కూల్చివేశారు. నమ్మశక్యం కాకున్నా ఇది నూటికి నూరుపాళ్లు వాస్తవం. సాధారణంగా రాజకీయ నాయకులు, అందులోనూ అధికారంలో ఉన్న వారు తమను తాము చట్టానికి అతీతులుగా భావిస్తుంటారు.  భూసేకరణ, కూల్చివేతలు వంటి అంశాలు తమ ఆస్తుల వరకూ రావని, రాకూడదనీ భావిస్తుంటారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో తనకూ సామాన్యులకూ ఒకే విధానం ఉండాలనీ, ఉంటుందనీ నిరూపించారు.

విషయంలోకి వస్తే.. మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డికి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇల్లు ఉంది. కొండారెడ్డి పల్లిలో రోడ్ల విస్తరణలో భాగంగా రోడ్లను 40 పీట్ల నుంచి 60 ఫీట్లకు పెంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోపలు గృహాల ప్రహారీ గోడలను కూల్చివేయాల్సివచ్చింది. ఆ గృహాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉంది.  ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తన నివాసమైనా, ఎవరి నివాసమైనా సరే ఎటువంటి మినహాయింపులూ ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు ముఖ్యమంత్రి నివాసం ప్రహారీ గోడను కూడా రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేశారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu