సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ ఎమ్మెల్యేపై విచారణ

 

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ను జూబ్లీహిల్స్ పోలీస్‌లు విచారించారు. బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో భాగంగా ఆయన్ను సుమారు 30 నిమిషాల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కిషోర్ మాట్లాడుతు తాను కేటీఆర్‌పై సీఎం రమేష్ అసత్య ఆరోపణలు చేసిన సీఎం రమేష్ వ్యాఖ్యలను ఖండిస్తూ నేను మాట్లాడినందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నాపై కుట్రపూరితంగా  కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు.

 చట్టాలను గౌరవించి విచారణకు హాజరయ్యారని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కయి ఎన్ని కేసులు పెట్టినా మీకు భయపడేది లేదని తెలిపారు. మా పార్టీ నాయకుల గురించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే సీఎం అయినా, ఎంపీ అయినా తప్పకుండా తిప్పికొడతానని  కిషోర్‌ తెలిపారు. అక్రమ కేసులకు భయపడేది లేదు అని  కిశోర్ తేల్చిచెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో 172 కేసులు.. ఆరు నెలలు జైలుకు పోయిన నిఖార్సైన ఉద్యమకారుణ్ణి నేను అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రమేష్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ కుమార్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu