మోడీది పిరికిపంద చర్యలు.. కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆఫీస్ పై సీబీఐ దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ఆఫీస్ ను సీజ్ చేసినట్టు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మోడీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకే సీబీఐ దాడులు చేయిస్తున్నారు..కక్షపూరితంగానే మోడీ సర్కార్ సీబీఐ దాడులు చేయిస్తోంది..ప్రధాని మోడీది పిరికిపంద చర్యలు అని మండిపడ్డారు.ప్రధాని ఆదేశాల మేరకే సీబీఐ దాడులు చేసింది..ఇలాంటి వాటికి భయపడేది లేదు అని అన్నారు.

అయితే సీబీఐ మాత్రం సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజేంద్రసింగ్ కార్యాలయంలోనే దాడులు జరిపాం..కొన్ని కంపెనీలకు రాజేంద్రసింగ్ అనుకూలంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వచ్చాయి..కంపెనీల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించాం అంతే..కేజ్రీవాల్ ఆపీసులో కాదు అని చెబుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu