సింగరేణి కార్మికులకు కేసీఆర్ వరాల జల్లు
posted on Sep 25, 2015 12:25PM

తెలంగాణ సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు వరాలు కురిపించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సింగరేణిపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆయన సింగరేణి కార్మికులకు పలు వరాలు కురిపించారు. అయితే గతంలో ఎప్పటినుండో కార్మికులు తమ వేతనాల నుండి వృత్తి పన్ను వసూలు చేయోద్దని ప్రభుత్వాన్నికోరుతున్న నేపథ్యంలో కార్మికుల వేతనాల నుండి వృత్తిపన్ను రద్దు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాదు 2014 - 15 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన రూ.491 కోట్లు లాభాలు సాధించగా దానిలో 21 శాతం అంటే రూ 103.11 కోట్ల రూపాయలను కార్మికులకు పంచాలని ఆయన అధికారులకు సూచించారు. అయితే రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి రాష్ట్ర ఉన్నప్పుడు వచ్చిన లాభాల్లో 18 శాతమే కార్మికులకు పంచేవారని.. కానీ రాష్ట్ర విడిపోయిన తరువాత 20 శాతం పెంచామని.. ఈ ఏడాది దీనిని 21 శాతానికి పెంచుతున్నామని తెలిపారు. మొత్తం 60 వేల మంది కార్మికులు ఉన్నారని, ఒక్కో కార్మికునికి రూ.15 వేల నుంచి రూ.20 వేల దాకా అందే అవకాశాలున్నట్లు పేర్కొంది.