'సిఎం కావాలంటే కొంత సమయం వేచి చూడాలి '
posted on Nov 11, 2011 8:38AM
హైదరాబాద్:జగన్ పా
ర్టీ ఎందుకు వదిలి వెళ్లారో సమాధానం చెప్పాలని మంత్రి రఘువీరా రెడ్డి ప్రశ్నించారు . వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందాక ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తాము మొదట భావించామని అనంతపురం జిల్లాలో చెప్పారు. సిఎం పదవి రావాలంటే కొంత సమయం వేచి చూడాలని కూడా ఆయనకు సూచించామని కానీ ఆయనే తొందరపడి పార్టీని వదిలి వెళ్లారన్నారు.
ప్రపంచంలో తానే పెద్ద నీతివంతుడినన్న భ్రమతో జగన్ మాట్లాడుతారని ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి హైదరాబాదులో ఎద్దేవా చేశారు. జగన్ అంత నీతివంతుడైతే తన కంపెనీలలోకి అన్నేసి పెట్టుబడులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈడి వాళ్లు జగన్‌కు నోటీసులు ఇచ్చారని వారికి ఆయన పెట్టుబడులపై సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. మలేషియా నుండి ఎంత వచ్చింది, ఏ కంపెనీలోకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాల్సిందేనన్నారు.