22వ సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తా: బాపూజీ
posted on Nov 11, 2011 8:52AM
హైదరా
బాద్: హైదరాబాదులోని తెలంగాణ అమర వీరులకు గన్‌పార్కు వద్ద నివాళులు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.తెలంగాణపై కొత్త వేషాలు వేస్తే ఊరుకునేది లేదని అయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.తెలంగాణపై తన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెట్టి, నిర్దిష్ట కాలపరిమితితో రాష్టాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటనలకే విలువ లేదని, కమిటీల ప్రకటనలకు విలువ ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై ఈ నెల 22వ తేదీన రామ్ లీలా మైదానం నుంచి పార్లమెంటు వరకు సత్యాగ్రహ యాత్ర నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందులో స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు .