పార్టీపై దృష్టి పెట్టిన చంద్రబాబు.. జిల్లా ఇంఛార్జిల నియామకం

 

టీడీపీ అధినేత చంద్రబాబు మొన్నటి వరకూ అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో చాలా బిజీబజీగా గడిపేశారు. అయితే ఇప్పుడు పార్టీపై పూర్తి దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇప్పుడు జిల్లాల్లో పార్టీ బలోపేతం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే చాలా కాలంగా పెండింగుల్లో ఉన్న జిల్లా ఇంఛార్జిలను నియామించడం జరిగింది.

* కడప - అనంతపురం జిల్లాల ఇంఛార్జిగా మాజీ మంత్రి దివంగత బీవీ మోహనరెడ్డి కుమారుడు జయనాగేశ్వరరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
* కర్నూలు చిత్తూరులకు వర్ల రామయ్యను నియమించారు.
* గుంటూరు - ప్రకాశం - నెల్లూరు జిల్లాలకు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించారు.
* విజయనగరం - శ్రీకాకుళం - పశ్చిమగోదావరిలకు రెడ్డి సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించారు.
* కృష్ణా - తూర్పుగోదావరి - విశాఖ జిల్లాల ఇంఛార్జిగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి నియమించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu