పెద్ద కొడుకులా వుంటా.. చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురానికి నీటి కొరతను లేకుండా చేయడానికి కృషిచేస్తున్నామని.. ప్రతి ఎకరానికి నీరందించడమే తమ లక్ష్యమని అన్నారు. లక్ష్యాన్ని ఛేదించే వరకూ మళ్లీ మళ్లీ జిల్లా పర్యటనకు వస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. అంతేకాక రాష్ట్రం విడిపోయిన తరువాత ఎంత ఆర్ధిక సంక్షోభం ఏర్పడినా కూడా రుణమాఫీలు చేశానని, ఫించన్లు ఇచ్చానని అన్నారు. పేదవారి ఇంటికి పెద్ద కొడుకులా వుండి కష్టపడతానని.. రైతుల అప్పును తన భుజాలపై వేసుకొని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu