ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ : సీఎం చంద్రబాబు

 

ఏపీలో సెప్టెంబర్‌ 1 నుంచి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక ఆధారంగా ఈ కొత్త బార్‌ పాలసీ అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. లిక్కర్ పాలసీ అంటే ఆదాయం కాదు.. ప్రజల ఆరోగ్యం ముఖ్యమనే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 

దీంతో అల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం విక్రయాలతో నష్టం తగ్గించ వచ్చునని భావిస్తుంది. అంటే.. మద్యం కారణంగా పేదల ఇళ్లు, ఒళ్లు గుల్లా కాకుండా చూడాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆ క్రమంలో బార్లలో కూడా గీత కార్మిక వర్గాలకు 10 శాతం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు  కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu