రాయలసీమకు నీరిచ్చానన్న తృప్తి చాలు : సీఎం చంద్రబాబు

 

నంద్యాల జిల్లా మల్యాల పంపింగ్ స్టేషన్‌లో హంద్రీనీవా కాలువలకు నీటిని విడుదల చేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతు నందికొట్కూరులో ఉండే హంద్రీ-చిత్తూరులోని నీవాని కలపాలి అనుకున్నాప్పుడు అసాధ్యం అన్నారు. ఆ కల కనింది నందమూరి తారక రామారావు అయితే దాన్ని మేము సాకారం చేశామని చంద్రబాబు తెలిపారు.  రాయలసీమ నీరిచ్చానన్న తృప్తి  నాకు చాలు. హంద్రీనీవాతో 6లక్షల ఎకారాలకు నీరు అందుతుంది. సీమ చరిత్రను మార్చాలని హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది. ఎన్టీఆరే అని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ ఫేక్ పార్టీ అని ఐదేళ్లలో రూ. 2 వేల కోట్లు కూడా సీమ కోసం జగన్ ఖర్చు చేయలేదని ఆయన తెలిపారు. 

 వైసీపీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ఆపార్టీకి లేదు అని ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి పని చేసిన వ్యక్తి రౌడిషీటర్లు, గంజాయి బ్యాచ్‌ను పరామర్శించేందుకు వెళ్తారా? ఇలాంటి వారు రాజకీయల్లో ఉండాలా? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అన్నదాత కష్టపడి పండించిన మామిడి కాయలను రోడ్లపై తొక్కించారు. ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. రౌడీలు తోక జాడిస్తే కట్ చేస్తాం మీరు ఏం చేసిన నిఘా ఉంచుతాం అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్‌ తొలిసారి ఆలోచించారు. 

హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్‌, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుంది. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం నాది.  గత వైసీపీ ప్రభుత్వం పింఛను రూ. వెయ్యికి పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకేసారి రూ. వెయ్యి పెంచి పింఛను ఇచ్చాం. దివ్యాంగుల పింఛను ఒకేసారి రూ.6 వేలకు పెంచిన ఘనత మాదే. పేదవాడికి అన్నం పెట్టే క్యాంటీన్లు మూసేశారు. మేం వచ్చాక మళ్లీ అధికారంలోకి వచ్చాక 207 అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో 21 దేవాలయాల్లో అన్నప్రసాదం ప్రారంభించాం’’ అని చంద్రబాబు అన్నారు.