హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు
posted on Jul 17, 2025 3:35PM

హంద్రీనీవా కాలువలకు నీటిని సీఎం చంద్రబాబు విడుదల చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్‌లో రెండు మోటార్లను ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరును అందుబాటులోకి వచ్చింది జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్మనను ముఖ్యమంత్రి తిలకించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు హంద్రీ-నీవా కాలువ ద్వారా నీటి విడుదల చేశారు. తొలుత మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు.
శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి సీమ జిల్లాలకు వివిధ కాల్వలకు.. రిజర్వాయర్లకు విడుదల చేసిన నీటిని సక్రమంగా వినియోగించుకునేలా ప్రణాళిక బద్దంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుపతి వద్ద గాలేరు-నగరి, హంద్రీ-నీవా, సోమశిల-స్వర్ణముఖి కలిసేలా ప్రణాళికలు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద పూజలు నిర్వహించారు. మల్యాల పంప్ స్టేషన్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. హంద్రీ-నీవా ఫేజ్-1 విస్తరణ పనులు, కాల్వల ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల, పయ్యావుల, బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరీ, అధికారులు పాల్గోన్నారు.