నా ప్రియ మిత్రుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినం సందర్బంగా ఈ సందర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా బ‌ర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు చంద్రబాబుకు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షల తెలియజేశారు. భవిష్యత్ రంగాలపై దృష్టి సారించి, ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి.. చేస్తున్న తీరును ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా’’ అని మోదీ తెలిపారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సామాజిక మాధ్యమాల వేదికగా బ‌ర్త్ డే విషెస్ తెలిపారు. దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి ట్వట్టీర్ వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా  బ‌ర్త్ డే విషెస్  తెలియజేశారు. అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు అంటూ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై, శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని అన్నారు. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని మరోసారి తెలిపారు. దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబును మెగాస్టార్  చిరంజీవి కొనియాడారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  చంద్ర‌బాబుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ బ‌ర్త్ డే నారా చంద్ర‌బాబు నాయుడు గారూ! మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను!" అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సీబీఎన్‌కు జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. అటు కేంద్ర‌మంత్రులు, మంత్రులు ఆయ‌న‌కు బ‌ర్త్ డే విషెస్ చెబుతున్నారు.