సీబీఎన్.. ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం!

రేసులో పడిపోయిన ప్రతిసారీ నిలబడటమే కాదు..  పరుగెత్తి గెలవడమంటే ఆషామాషీ కాదు.. అది ఎప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారు కాబట్టే చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు.  చంద్రబాబు ఏజ్ బార్ అయింది.. టీడీపీ పనైపోయంది.. రాష్ట్రంలో ఇక వైసీపీకి ఎదురే లేదని జగన్ టీం తెగ హడావుడి చేసింది. అయితే సెవెన్టీ ప్లస్ ఏజ్‌లో కూడా పొలిటికల్‌గా తాను యంగ్ టర్క్‌నని నిరుపించుకున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అత్యధిక సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి చరిత్ర సృష్టించారు.  దాంతో పాటు ఎన్డీఏ కూటమిలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించి, కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నారు. 76వ పడిలోకి అడుగుపెట్టిన ఆయన పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. 

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం స‌ృష్టించింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి అనడం కంటే. తెలుగుదేశం, జనసేనల బలమే వైసీపీని మట్టికరిపించిందనడం కరెక్ట్.ఎందుకంటే ఆ పార్టీల అండ లేకుంటే బీజేపీకి ఏపీలో ఉన్న ఉనికి నామమాత్రమే. విజనరీ లీడర్, అపరచాణక్యుడిగా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న సీబీఎన్ మండుటెండల్లో  ప్రచారం చేసిన తీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇతర పార్టీల నేతలు భానుడి ప్రతాపాన్ని  తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు.  కాని ఆ సూర్యుడు ఈ చంద్రుడి స్పీడ్‌కి  బ్రేక్‌లు కాదు కదా కనీసం స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేకపోయాడు. సెవెన్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్‌‌లో తొంభై సెగ్మెంట్లలో సీబీఎన్ ప్రచారం చేశారంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అవుతుంది.  ఐటీ ఇండియన్ ఆఫ్ ద మిలీనియం.  బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్..  సౌత్ అసియన్ ఆఫ్ ద ఇయర్.. వరల్డ్ ఎకనమిక్స్ ఫోరం డ్రీమ్‌ క్యాబినెట్‌ మెంబర్.. ఇదీ విజనరీ లీడర్  చంద్రబాబుకి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన గుర్తింపు.

ఆ విజనే రాజధాని లేకుండా విడిపోయిన ఏపీలో జరిగిన మొదటి ఎన్నికల్లో జనం చంద్రబాబుకు పట్టం కట్టేలా చేసింది. అంతర్జాతీయంగా నారావారిని ఎందరు ఎన్నిరకాలుగా ఆకాశానికెత్తేసినా,  తెలుగోళ్లకు మాత్రం అభివృద్ది కాముకుడు, అపరచాణక్యుడే.  చంద్రబాబు పేరు చెప్తే హైదరాబాద్ హైటెక్‌ సిటీకి పునాది వేసిన సైబర్ టవర్సే గుర్తొస్తాయి. అలా ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో తనదైన బ్రాండ్ వేసుకున్న సీబీఎన్. విభజిత ఆంధ్రప్రదేశ్ కు  కూడా హైదరాబాద్ స్థాయి రాజధానిని ఏర్పాటు చేస్తారనీ,  అభివ‌ృద్దిని పరుగులు పెట్టిస్తారనే 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనను నెత్తినపెట్టుకున్నారు. 

అమరావతి రాజధానికి అంకురార్పణ చేసి .. రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్న టైంలో చంద్రబాబు స్పీడ్‌కి బ్రేకులు పడ్డాయి.  ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధ్యక్షుడు చేసుకున్న అభ్యర్ధన రాష్ట్ర స్థితిగతుల్ని మార్చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనామకంగా, అగమ్యగోచరంగా తయారైంది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్, 14 ఏళ్లు సీఎంగా ఉన్న సీబీఎన్  రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించి అభాసుపాలయ్యారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక వైపు అమరావతి డెవలప్‌మెంట్, రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెట్టిస్తూనే,  పెట్టబడులు, పరిశ్రమల స్థాపనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. 

ఇప్పుడు ఏపీ, తెలంగాణ రోడ్లపై పరుగులు పెడుతున్న కియా కార్లను చూస్తే తెలుగోళ్లకు చంద్రబాబునాయుడే కనిపిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన సీబీఎన్ ను  రాష్ట్ర విభజన తర్వాత మరోసారి సీఎంని చేసింది ఆ హైటెక్ విజనే.   ఆయన అమరావతి రాజధాని అనగానే జగన్‌ సహా అందరూ ఆమోదించారు. అయితే..  2019 ఎన్నికల తర్వాత ఈక్వేషన్లు మారిపోయాయి.  రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో ఏపీ ప్రజలు మిగిలారు

.బటన్ నొక్కుడు పాలిటిక్స్ మొదలు పెట్టిన జగన్.. సంక్షేమం డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోకి ట్రాన్స్ ఫర్ చేస్తూ కొత్త ట్రెండ్ మొదలు పెట్టారు. 2024 ఎన్నికల్లో కూడా ఆ నవరత్నాలే తనను గెలిపిస్తాయన్న ధీమాతో కనిపించారు.  పైగా.. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తన హయాంలోని పథకాలు అన్నీ ఆగిపోతాయని ప్రచారంలో చెప్పారు. 2014లో ఎన్డీఏ కూటమితో గెలిచిన చంద్రబాబు.  గత ఎన్నికల్లో ఆ కూటమికి దూరమై దెబ్బ తిన్నారు.  అయితే... రాష్ట్రం సంక్షేమం కోసం  జగన్  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మళ్లీ 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేనలతో కలిశారు. 

అయితే పేరుకి  ఎన్డీఏ కూటమి అయినా దానికి పెద్ద దిక్కు చంద్రబాబే అయ్యారు. ప్రచార  బాధ్యతను కూడా భుజ స్కంధాలపై వేసుకుని ముందుకు సాగారు. ఓవైపు ప్రభుత్వంలోని వైఫల్యాలను ఎండగడుతూనే... తాము అధికా రంలోకి వస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు చంద్రబాబు.. ఎండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించారు.  నవరత్నాలని  వైసీపీ అంటే. సూపర్ సిక్స్, భవిష్యత్తుకు గ్యారెంటీ హామీలతో  చంద్రబాబు దూసుకుపోయారు.  జగన్ సర్కారు మద్యం పాలసీ, ఇసుక దందాలు, వైసీపీ నేతల అరాచకాలపై ఫైర్ అవుతూ ఎన్నికల ప్రచారంలో క్లైమాక్స్ పంచ్‌లు విసిరారు.  టీడీపీ అధినేత నవరత్నాల పేరుతో  జగన్ ప్రజలకు చాక్లెట్ ఇచ్చి.. నెక్లెస్‌లు తీసుకుంటున్నారంటూ ప్రజల్ని ఆలోచింపచే శారు చంద్రబాబు. ఎన్నికల ప్రచారాన్ని అన్నీ తానై నడిపించారు

.  పని రాక్షసుడిగా టాగ్‌లైన్ తగిలించుకున్న హైటెక్ లీడర్ బర్త్ డేట్ 1950 ఏప్రిల్ 20.  14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయన వయసు ప్రస్తుతం 74 ఏళ్లు. మండు టెండల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఆయన 90 సెగ్మెంట్లలో ఎన్నికల ప్రచారం పూర్తి చేసారంటే.. మామూలు విషయం కాదని రాజకీయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  దటీజ్ చంద్రబాబు అంటూ కితాబులిచ్చారు.

. ఆయనకంటే వయస్సులో చిన్నవారైన పవన్‌కళ్యాణ్, జగన్‌.. ఎండ ధాటికి తట్టుకోలేక షార్ట్ బ్రేక్‌లు తీసుకున్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం నిత్య యవ్వనుడిలా అలుపెరుగని పోరాటం చేశారు.  ఒక్కసారి కూడా బ్రేక్‌ తీసుకోకుండా,  అటు పార్టీ నేతలతో పాటు ప్రజలూ ఆశ్చర్య పడేలా చేశారు. అంతే కాదు..  రోజుకి మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటూ జనాలతో మమేకం అయ్యారు. ప్రతి అంశాన్నీ జనాలకు చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో అంశాలతో పాటు జగన్ ప్రభుత్వ పనితీరుపై  తనదైనలో శైలిలో కౌంటర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు, సీట్ల సర్ధుబాటు సహా అన్ని అంశాలనూ జనంలోకి తీసుకెళ్లగలిగారు.  ఓవరాల్‌గా ఈ అభివృద్ది కాముకుడు చేసిన పోరాటం ఫలించింది.  ఆయన ఊహించిన దానికంటే బెస్ట్ రిజల్ట్ లభించింది.151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి కనీసం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయగలిగారు. అటు కేంద్రంలోనూ సోలో మెజార్టీకి దూరమైన బీజేపీకి దిక్కు అయ్యారు.  ఎన్డీఏ కూటమిలో రెండో పెద్దపార్టీగా అవతరించడంతో కేంద్రానికి అణిగిమణిగి ఉండాల్సిన ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది టీడీపీకి. ఆ క్రమంలో చంద్రబాబుతో పాటు ఏపీ వాసులంతా కలలుగంటున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది.  అందుకే అందరి నోటా ఎన్నికల ప్రచారం తర్వాత ఒకటే మాట వినిపించింది. అదే .. సీబీఎన్ ద గ్రేట్.