నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.. చంద్రబాబుకు లోకేశ్ బర్త్‌డే విషెస్
posted on Apr 20, 2025 12:03PM

ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ 75వ పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీబీఎన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా చంద్రబాబునాయుడికి ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "నాన్నగారికి శుభాకాంక్షలు. నా స్ఫూర్తి నారా చంద్రబాబు నాయుడు గారూ. వెరీ హ్యాపీ బర్త్ డే" అని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఓ ఆసక్తికర వీడియోను కూడా జోడించారు. మరోవైపు సీఎం చంద్రబాబునాయుడికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘పుట్టినరోజు శుభాకాంక్షలండీ’ అంటూ ఎక్స్ వేదికగా ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు.‘‘మన ఆంధ్రప్రదేశ్ కుటుంబం పట్ల మీకున్న అంతులేని మక్కువతో మీరు నా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నారు. మీ బలం, మీ దార్శనికత నన్ను ప్రతిరోజూ మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతున్నాయి. మీకు తోడుగా ఉండటం చాలా గర్వంగా ఉంది. నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను. నా ప్రేమతో మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాను’’ అని భువనేశ్వరి రాసుకొచ్చారు. కాగా, చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.