రాజీనామాను ఆమోదించండి: చిరు

 

Chiranjeevi resigns, Telangana fallout, telanga state, congress, seemandhra, chiranjeevi

 

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని  ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల హక్కులు నెరవేరాలంటే హైదరాబాదును యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు.

 

విభజన అంశం మీద కేంద్రం తీరును తప్పుపడుతూ ఆయన లేఖ కూడా రాశారు. గత అక్టోబరులో ప్రధానికి లేఖ రాసిన సమయంలోనే తన రాజీనామాను ప్రస్తావించానని, రాజీనామాను తక్షణం ఆమోదించాలని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి చిరు రాజీనామాను ఆమోదిస్తారా ? లేక ఆయన రాజీ పడతారా ? వేచిచూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu